T6-W1-The EXIT DOOR (వెలుపలికి దారి)

 

William Higginson విలియం హిగ్గిన్సన్ — The Exit Door


నలుపు, తెలుపు గడులతో కూడిన గది గోడల మీదుగా నేల వరకూ విస్తరించి ఉంది. గోడలో ఉన్న ఎర్రటి తలుపు తెరిచి ఉంది; దాని అవతల నీలి ఆకాశం, పచ్చని పొలంతో కూడిన బహిరంగ ప్రపంచం కనిపిస్తోంది. తెల్లటి పూలతల ఉన్న ఒక వ్యక్తి తలుపు వైపు చూస్తున్నాడు. అతని ప్రక్కన తలుపుకు వేసిన ఎర్రని పెయింట్  ఉన్న డబ్బా, కొంత కారుతూ ఉంది. గది లోపల అంతా గడుల క్రమబద్ధమైన అమరిక; తలుపు అవతల మాత్రం ఆ గడులేవీ లేని విశాలమైన ప్రపంచం. కమలం పువ్వు వంటి తలకలిగిన ఆ వ్యక్తి, వివిధ కోణములలో ఆలోచనలకు ప్రతీకగా కనబడతాడు. చదరంగపు గడులు లెక్కలువేసి ముందుకు సాగే తత్వాన్ని చూపుతాయి.

తలుపు తెరిచి ఉంది—మరి ఆ వ్యక్తి బయటకు వెళ్లడానికి ఇంకా ఏం లెక్కలు వేస్తున్నాడు? ఇంకా పెయింట్ కారుతూ ఉన్న డబ్బా ఆ కనపడుతున్న తలుపు రంగు ఒకటే కావడం గమనించదగినది. అంటే అతను తలుపుకి రంగు అప్పుడే వేశాడన్నమాట. బయట ఉన్న పచ్చటి పొలాలు కూడా అతని ఊహలే అన్న మాట. ఈ చిత్రానికి The Exit Door అని పేరు పెట్టడంలో ఆంతర్యం ఆలోచించండి.

                                                               x-x-x-END-x-x-x

Comments

Popular posts from this blog

T5-D1-Dreams on a Beach (అంతులేని అంచు)

4-V1-Eyes on the Table