Posts

Showing posts from October, 2026

T6-W1-The EXIT DOOR (వెలుపలికి దారి)

Image
  William Higginson విలియం హిగ్గిన్సన్ — The Exit Door   (for English version press here) నలుపు , తెలుపు గడులతో కూడిన గది గోడల మీదుగా నేల వరకూ విస్తరించి ఉంది. గోడలో ఉన్న ఎర్రటి తలుపు తెరిచి ఉంది ; దాని అవతల నీలి ఆకాశం , పచ్చని పొలంతో కూడిన బహిరంగ ప్రపంచం కనిపిస్తోంది. తెల్లటి పూలతల ఉన్న ఒక వ్యక్తి తలుపు వైపు చూస్తున్నాడు . అతని ప్రక్కన తలుపుకు వేసిన ఎర్రని పెయింట్   ఉన్న డబ్బా , కొంత కారుతూ ఉంది. గది లోపల అంతా గడుల క్రమబద్ధమైన అమరిక ; తలుపు అవతల మాత్రం ఆ గడులేవీ లేని విశాలమైన ప్రపంచం. కమలం పువ్వు వంటి తలకలిగిన ఆ వ్యక్తి , వివిధ కోణములలో ఆలోచనలకు ప్రతీకగా కనబడతాడు. చదరంగపు గడులు లెక్కలువేసి ముందుకు సాగే తత్వాన్ని చూపుతాయి . తలుపు తెరిచి ఉంది—మరి ఆ వ్యక్తి బయటకు వెళ్లడానికి ఇంకా ఏం లెక్కలు వేస్తున్నాడు ? ఇంకా పెయింట్ కారుతూ ఉన్న డబ్బా ఆ కనపడుతున్న తలుపు రంగు ఒకటే కావడం గమనించదగినది. అంటే అతను తలుపుకి రంగు అప్పుడే వేశాడన్నమాట . బయట ఉన్న పచ్చటి పొలాలు కూడా అతని ఊహలే అన్న మాట. ఈ చిత్రానికి The Exit Door అని పేరు పెట...

6-W1—The Exit Door (2026)

Image
  by William Higginson — The Exit Door  తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి A room covered in black-and-white squares extends seamlessly across the walls and the floor. A red door in the wall stands open, revealing a world beyond with a blue sky and a green field. A man with a head resembling a white lotus flower stands looking towards the door. Beside him is a can of red paint, with paint still dripping from it. The room is arranged in an orderly pattern of squares resembling a chessboard, while the world beyond the door is vast and free of such patterns. The chessboard brings to mind our tendency to calculate and plan our moves before proceeding. The lotus-like head suggests a mind that may look at things from different angles. The door is open—so what is the man still calculating before stepping out? It is worth noticing that the paint still dripping from the can is the same red as the door. This suggests that he has only just painted it. Could the green fields visible beyo...

T5-D1-Dreams on a Beach (అంతులేని అంచు)

Image
సాల్వడార్ డాలీ — Dreams on a Beach ( అంతులేని అంచు) (for English version press here) విశాలమైన సముద్రతీరంలో ఒక విచిత్రమైన ఆకారం కనిపిస్తుంది. గుండ్రని ఆకారాలు ఒక పీఠంపై నిలిచి , వాటిపై కప్పిన ముసుగు ఒక రూపాన్ని దాస్తున్నాయి. ఒక పొడవైన ఎర్రటి కర్ర బయటకు చొచ్చుకువచ్చి , దాని చివర ఒక చిన్న వస్తువు వేలాడుతోంది. ఆ నిర్మాణం అస్థిరంగా కనిపిస్తుంది. ఏదో విధంగా సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. గంభీరమైన సముద్రం మన జీవితానికి ప్రతీకగా కనిపిస్తుంది—మన ముందున్న జీవితం విశాలమైనది , కానీ దాని గమనం ముందుగానే నిర్ణయించబడినది కాదు. ఆ విచిత్రమైన నిర్మాణం , ముందేమి జరుగుతుందో కొంత భరోసా లభించేవరకు జీవితంలోకి అడుగుపెట్టడానికి సంకోచించే వ్యక్తిని సూచిస్తున్నట్టుంది. బయటకు చొచ్చుకువచ్చిన కర్రను చూస్తే , దారి స్పష్టంగా కనిపించనప్పుడు ఆధారం కోసం కర్రతో తచ్చాడటం గుర్తుకొస్తుంది. అయితే , ఆ కర్ర సాగిన దిశ అనిశ్చితిని తొలగించేలా కనిపించడం లేదు. మనం కూడా జీవితాన్ని ఇలాగే ఎదుర్కొంటామేమో. జ్ఞానాన్ని సముపార్జించుకుంటాం , తెలియని వాటికి వివరణలు కల్పించుకుంటాం , భవిష్యత్తును భద్రపరచుకోవడానికి , జీవి...

5-D1-Dreams on a Beach

Image
  Salvador Dalí — Dreams on a Beach ( The Edge of Uncertainty ) తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి A strange structure stands on a vast seashore. Rounded forms rest on a pedestal, concealing a veiled figure above them. A long red pole projects outward, with a small object dangling from its tip. The entire arrangement appears unstable, as though it is struggling to maintain its balance. The vast sea stretches into the distance, suggesting the openness of life itself. Life lies before us, but its course is not predetermined. The strange structure seems to represent someone who hesitates to step into life until there is some assurance of what lies ahead. The projecting pole brings to mind the act of probing with a stick when the way forward is unclear, searching for something to rely on. Yet the direction in which the pole extends does not seem to dispel the uncertainty. Perhaps we, too, approach life in much the same way. We accumulate knowledge, construct explanations for what we d...

T4-V1-Eyes on the Table (అంతర దృష్టి)

Image
  రెమెడియోస్ వారో — Eyes on the Table  (అంతర దృష్టి) (for English version press here) రెమెడియోస్ వారో చిత్రించిన Eyes on the Table లో , కళ్లజోడు అద్దాల వెనుక ఉండాల్సిన కళ్ళు వాటి వెలుపల కనిపిస్తాయి. మనం సాధారణంగా ఆశించే అమరికకు ఇది విరుద్ధం. మరి ఆ కళ్ళు ఎక్కడ ఉన్నాయి ? ఎలాంటి ఆధారం కనిపించని ఒక తేలియాడే బల్లపై! మనకు పరిచయమైన వస్తువులను , వాటి అమరికను ఇలా మార్చడం ద్వారా మనం సహజంగా నిజమని భావించే విషయాలను ప్రశ్నించేలా చేస్తుంది ఈ చిత్రం. ఈ అమరిక మన చూపును అంతర్ముఖం చేసుకోమని సూచిస్తున్నట్టుంది. అయితే , చూపును లోపలికి తిప్పుకున్నంత మాత్రాన మనం చూసే విధానం మారుతుందా ? మనకు అలవాటైన ఆలోచనా ధోరణులు మనతోపాటే వస్తే , మనం నిజంగా కొత్తగా తెలుసుకున్నది ఏమిటి ? అన్నమయ్య చెప్పిన “ ఊరులేని పొలిమేర” అనే రూపకం ఇక్కడ అనుకోని పోలికను అందిస్తుంది. ఒక పొలిమేరకు అర్థం , అది ఏ ఊరి సరిహద్దో దానితోనే ఏర్పడుతుంది. ఊరే లేకపోతే , ఆ పొలిమేర దేనిని వేరు చేస్తుంది ? దానికి అర్థం ఏమిటి ? అసలు అది ఎక్కడికి చెందుతుంది ? దాని ఉనికికి ఆధారమే ప్రశ్నార్థకమవుతుంది. ఆధారం లేని తేలియాడే బల్ల ఈ పరిశీలనకు ...

4-V1-Eyes on the Table

Image
Remedios Varo’s Eyes on the Table తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి In Remedios Varo’s Eyes on the Table , the eyes lie outside the glass lenses of the spectacles, reversing the arrangement we normally expect. And where do we find them? On a table that floats, without any visible support. The familiar objects and their setting have been disturbed, making us question what we ordinarily take for granted. The arrangement seems to invite us to turn our gaze inward. But does merely turning our gaze inward change the way we see? If our familiar habits of thought accompany us, what have we really discovered? Annamacharya’s image, “ ఊరులేని పొలిమేర ,” offers an unexpected parallel. A boundary has meaning in relation to the village it bounds. Without the village, what does the boundary delimit? Where does it belong? The very basis of the boundary becomes questionable. The floating table adds another dimension to this inquiry. We take our relationship with the world for granted, much as we take...

T3-R3-La Clairvoyance (దివ్యదృష్టి)

Image
రెనే మాగ్రిట్ — La Clairvoyance ( దివ్యదృష్టి ) (For English version Press here) రెనే మాగ్రిట్ చిత్రించిన La Clairvoyance లో , చిత్రకారుడి చూపు ఒక గుడ్డుపై నిలిచి ఉంటుంది. కానీ , అతని కాన్వాస్‌పై రెక్కలు విప్పిన పక్షి కనిపిస్తుంది. గుడ్డును చూస్తే , అప్పటికే మనకు కనిపిస్తున్న దానికంటే కొత్తగా తెలుసుకోవడానికి పెద్దగా ఏమీ లేదనిపిస్తుంది. కానీ , ఆ గుడ్డులోంచి ఊహించుకున్న పక్షి మాత్రం పూర్తిగా భిన్నమైన అవకాశాల ప్రపంచాన్ని మన ముందుంచుతుంది. చిత్రకారుడి దృష్టి , ఉన్నదాన్ని గమనించడం నుంచి , దాని నుంచి ఏమి ఉద్భవించవచ్చో ఊహించే దిశగా సాగింది. మన చుట్టూ ఎన్నో పరిచయమైన విషయాలు ఉంటాయి. వాటిలో కొత్తగా తెలుసుకోవడానికి ఏమీ లేదనిపించవచ్చు. చూడవలసినదంతా చూసేశామని అనుకున్నప్పుడు , పరిచయమైన విషయాలు సృజనాత్మక మనస్సును ఉత్తేజపరిచే శక్తిని కోల్పోతాయి. అప్పుడు ఊహాశక్తి రెక్కలు విప్పుతుంది. ప్రస్తుతం చూస్తున్నదాని పరిధిని దాటి , ఏమేమి సాధ్యమవుతాయో అన్వేషిస్తుంది. అయితే , ఈ ప్రక్రియలో మనం వర్తమానానికి కూడా దూరమవుతాం. మన ఊహతో మనమే నిర్మించుకున్న ఒక ప్రపంచంలోకి ప్రవేశిస్తాం.   -x-x-END-x-x-

3-R3-La Clairvoyance

Image
  René Magritte — La Clairvoyance తెలుగులో చదవడానికిఇక్కడ నొక్కండి In La Clairvoyance (by Rene Magritte) , the painter’s eyes are fixed on an egg, but his canvas shows a bird with outstretched wings. The egg may seem to offer little beyond what is already visible, while the bird opens up an entirely different world of possibilities. The painter’s attention has moved beyond observing what exists to imagining what can emerge. We are often surrounded by familiar things that seem to offer nothing new to discover. When we feel we have already seen all there is to see, the familiar loses its power to excite the creative mind. Imagination then spreads its wings, carrying us beyond what is present to what might be possible. Yet, in this very act, we also move away from the present, inhabiting a world of our own making. -x-x-END-x-x-

T2-R2-Personal Values (వ్యక్తిగత లక్షణాలు)

Image
రెనే మాగ్రిట్ — Personal Values ( వ్యక్తిగత లక్షణాలు) (for English version press here) Personal Values చిత్రంలో ఒక గది కనిపిస్తుంది. ఆ గదిలోని వస్తువుల అమరికను చూస్తే , అది ఒక వ్యక్తి ప్రాధాన్యాలకు అనుగుణంగా ఏర్పడిన వ్యక్తిగత ప్రపంచంలా అనిపిస్తుంది. అసాధారణంగా పెద్దవిగా కనిపించే దువ్వెన , షేవింగ్ బ్రష్ , సబ్బు— అతనికి తన రూపం , అలంకరణ పట్ల ఉన్న శ్రద్ధను , సమాజంలో తన గౌరవానికి ఉన్న ప్రాముఖ్యతను సూచిస్తున్నట్టున్నాయి. వాటితో పోలిస్తే , మంచానికి అంత ప్రాధాన్యం లేనట్టుగా కనిపిస్తుంది. అయితే , ఆ గది నిర్మాణమే విచిత్రంగా ఉంటుంది. దాని గోడలు పారదర్శకంగా ఉండి , మేఘాలతో నిండిన ఆకాశానికి తెరుచుకున్నట్టుగా కనిపిస్తాయి. బయట ప్రపంచానికి , గదికి మధ్య స్పష్టమైన విభజన కనిపించకపోయినా , అద్దంలా కనిపించే గోడలు ఆ వ్యక్తి వ్యక్తిగత ప్రపంచానికి సరిహద్దులను ఏర్పరుస్తున్నాయి. కుడివైపున ఉన్న వార్డ్‌రోబ్‌ అద్దం మరో సందేహాన్ని రేకెత్తిస్తుంది. అందులో సబ్బు ప్రతిబింబించడమే కాకుండా , కిటికీకి ఉన్న తెరలు కూడా కనిపిస్తాయి. దీంతో గదిని , దానిలోని అంశములను మనం అర్థం చేసుకున్న విధానమే ప్రశ్నార్థకమవుతుంది. మాగ్రిట్ వ...

2-R2-Personal Values

Image
René Magritte — Collective Invention తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి In Personal Values , by Rene Magritte, the room appears to be a private world organised around the man’s priorities. The oversized comb, shaving brush and soap suggest his concern for grooming and appearance, while the bed remains comparatively insignificant. Yet the room itself is strange: its walls seem transparent, opening onto a sky filled with clouds. Although there is no clear visual separation from the outside world, the glass-like walls still define the boundaries of the man’s private space. The mirror adds another mystery: it reflects the soap but also reveals curtains at a window, introducing an element that unsettles our understanding of the space. Magritte brings together personal priorities, uncertain boundaries and unseen presences. Even within the world we consider our own, how much lies beyond our awareness?                           ...

T1-R1-Collective Invention (సామూహిక మిథ్యాభావన)

Image
  రెనే మాగ్రిట్ — Collective Invention ( సామూహిక మిథ్యాభావన )  (for English version press here) రెనే మాగ్రిట్ చిత్రించిన Collective Invention మనకు పరిచయమైన మత్స్యకన్య రూపాన్ని తలకిందులు చేస్తుంది. సాధారణంగా స్త్రీ పైభాగం , చేప తోక కలిగిన మత్స్యకన్యకు బదులుగా , ఈ చిత్రంలో చేప తల , స్త్రీ శరీరం కనిపిస్తాయి. ఈ చిత్రం పేరు చిత్రంలోని అంతర్భాగం. ఒక కలయికను మనం మత్స్యకన్యగా సహజంగా అంగీకరిస్తూ , దానికి పూర్తి విరుద్ధమైన కలయికను చూసి ఎందుకు అసౌకర్యానికి గురి అవుతాం ? అసలు మత్స్యకన్య అనే ఊహే అసహజమైనది. అయినప్పటికీ , సమాజంలో ప్రబలంగా ఉన్న అభిప్రాయాలు మనకు ఎలా సహజమైనవిగా , ఎలా నమ్మదగినదిగా నిర్ణయిస్తామో మాగ్రిట్ ఈ చిత్రం ద్వారా చూపిస్తాడు. వేమన అన్నట్టు , “ పదుగురాడు మాట పాడియై చెల్లు.” చాలామంది ఒక మాటను చెబుతుండగా , అది ‘ నిజమ ’ నే అంగీకారం లోపలికంతా నాటుకుపోతుంది. ఈ చిత్రం మనం చూస్తున్న దృశ్యాన్నే కాకుండా , దానిని అర్థం చేసుకోవడానికి మనం ఆధారపడే ముందస్తు అభిప్రాయాలను కూడా ప్రశ్నించేలా చేస్తుంది. -x-x-END-x-x-

1-R1-Collective Invention

Image
  René Magritte — Collective Invention తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి René Magritte’s Collective Invention turns our familiar image of a mermaid upside down. Instead of the usual combination of a woman’s upper body and a fish’s tail, the painting presents a fish’s head attached to a woman’s body. The title itself is an integral part of the painting. Why do we readily accept one combination as a mermaid, yet feel uncomfortable when we see the exact reverse? After all, the very idea of a mermaid is unnatural. Yet Magritte shows how prevailing social beliefs shape what we consider natural and what we find believable. As the Telugu poet Vemana observed, “పదుగురాడు మాట పాడియై చెల్లు” — what many people say comes to be accepted as truth. When an idea is repeated by enough people, its acceptance as ‘truth’ takes root deep within us. The painting invites us to question not only what we see, but also the assumptions on which we rely to make sense of what we see.       ...

అధివాస్తవిక చిత్రముల వివరణ​

  కొన్ని అధివాస్తవిక చిత్రాలను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. అధివాస్తవిక చిత్రాలు మనకు పరిచయమైన ప్రపంచాన్ని దాటి , కలలను , అచేతన మనస్సును అన్వేషిస్తాయి. అందం , ఆకారం , నైతికత , పరిచయమైన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించక దాటవేసే ధోరణి వంటి పరిమితులను దాటి , వీక్షకుడి మనస్సును చిత్రంతో అనుసంధానిస్తాయి. సాధారణంగా మనకు పరిచయమైన వస్తువులను విచిత్రమైన లేదా అసాధ్యమైన పరిస్థితుల్లో ఉంచడం ద్వారా , మనం అలవాటుగా చూసే విధానాన్ని సవాలు చేస్తాయి. వాటి ఉద్దేశం కేవలం కల్పనతో కూడిన దృశ్యాలను సృష్టించడం మాత్రమే కాదు. అలవాటుపడిన గ్రహణ విధానాన్ని సమూలముగా ప్రశ్నించి , వెంటనే మనకు స్పష్టంగా కనిపించని అర్థాలను స్పురింపచేయుట కూడా. ఒక అధివాస్తవిక చిత్రం ఎప్పుడూ మనం ఏమి ఆలోచించాలో చెప్పదు ; మనకు ఇప్పటికే అర్థమయ్యాయని భావించిన విషయాలను మరోసారి పరిశీలించుకునేలా చేస్తుంది. భావమును ఆకారము అందముల బందిఖానా నుండి విడదీసి చిత్రకారుణ్ణి వీక్షకుని మనసుతో ప్రత్యక్షంగా కలిపే యత్నమిది. ఇంకొక గమనించ వలసిన విషయము ఏమంటే పెయింటింగ్ పేరు కూడా చిత్రములోని భాగమే. — END —  విషయానుక్రమణిక​ TR — Rene Magritte   రె...

A note on Surrealist Paintings

 I would like to introduce you to a few surrealist paintings. Surrealist paintings explore dreams and the unconscious mind, taking us beyond the familiar world we know. They challenge the constraints of beauty, form, and morality—and, in particular, our tendency to pass over familiar things without examining them closely. They bring the viewer’s mind into direct engagement with the painting. By placing familiar objects in strange or impossible situations, they challenge our habitual ways of seeing. Their purpose is not merely to create imaginative scenes. They also question our habitual patterns of perception at their roots, bringing to light meanings that may not be immediately apparent. A surrealist painting does not tell us what to think; rather, it invites us to look again at things we believe we already understand. It attempts to free meaning from the confinement of form and beauty, bringing the artist and the viewer into direct contact through the painting. One more point des...