T3-R3-La Clairvoyance (దివ్యదృష్టి)

రెనే మాగ్రిట్ — La Clairvoyance (దివ్యదృష్టి)
రెనే మాగ్రిట్ చిత్రించిన La Clairvoyance లో, చిత్రకారుడి చూపు ఒక గుడ్డుపై నిలిచి ఉంటుంది. కానీ, అతని కాన్వాస్‌పై రెక్కలు విప్పిన పక్షి కనిపిస్తుంది. గుడ్డును చూస్తే, అప్పటికే మనకు కనిపిస్తున్న దానికంటే కొత్తగా తెలుసుకోవడానికి పెద్దగా ఏమీ లేదనిపిస్తుంది. కానీ, ఆ గుడ్డులోంచి ఊహించుకున్న పక్షి మాత్రం పూర్తిగా భిన్నమైన అవకాశాల ప్రపంచాన్ని మన ముందుంచుతుంది. చిత్రకారుడి దృష్టి, ఉన్నదాన్ని గమనించడం నుంచి, దాని నుంచి ఏమి ఉద్భవించవచ్చో ఊహించే దిశగా సాగింది.

మన చుట్టూ ఎన్నో పరిచయమైన విషయాలు ఉంటాయి. వాటిలో కొత్తగా తెలుసుకోవడానికి ఏమీ లేదనిపించవచ్చు. చూడవలసినదంతా చూసేశామని అనుకున్నప్పుడు, పరిచయమైన విషయాలు సృజనాత్మక మనస్సును ఉత్తేజపరిచే శక్తిని కోల్పోతాయి. అప్పుడు ఊహాశక్తి రెక్కలు విప్పుతుంది. ప్రస్తుతం చూస్తున్నదాని పరిధిని దాటి, ఏమేమి సాధ్యమవుతాయో అన్వేషిస్తుంది.

అయితే, ఈ ప్రక్రియలో మనం వర్తమానానికి కూడా దూరమవుతాం. మన ఊహతో మనమే నిర్మించుకున్న ఒక ప్రపంచంలోకి ప్రవేశిస్తాం. 
-x-x-END-x-x-

Comments

Popular posts from this blog

T6-W1-The EXIT DOOR (వెలుపలికి దారి)

T5-D1-Dreams on a Beach (అంతులేని అంచు)

4-V1-Eyes on the Table