T4-V1-Eyes on the Table (అంతర దృష్టి)

 

రెమెడియోస్ వారో — Eyes on the Table (అంతర దృష్టి)

రెమెడియోస్ వారో చిత్రించిన Eyes on the Table లో, కళ్లజోడు అద్దాల వెనుక ఉండాల్సిన కళ్ళు వాటి వెలుపల కనిపిస్తాయి. మనం సాధారణంగా ఆశించే అమరికకు ఇది విరుద్ధం. మరి ఆ కళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఎలాంటి ఆధారం కనిపించని ఒక తేలియాడే బల్లపై!

మనకు పరిచయమైన వస్తువులను, వాటి అమరికను ఇలా మార్చడం ద్వారా మనం సహజంగా నిజమని భావించే విషయాలను ప్రశ్నించేలా చేస్తుంది ఈ చిత్రం. ఈ అమరిక మన చూపును అంతర్ముఖం చేసుకోమని సూచిస్తున్నట్టుంది. అయితే, చూపును లోపలికి తిప్పుకున్నంత మాత్రాన మనం చూసే విధానం మారుతుందా? మనకు అలవాటైన ఆలోచనా ధోరణులు మనతోపాటే వస్తే, మనం నిజంగా కొత్తగా తెలుసుకున్నది ఏమిటి?

అన్నమయ్య చెప్పిన “ఊరులేని పొలిమేర” అనే రూపకం ఇక్కడ అనుకోని పోలికను అందిస్తుంది. ఒక పొలిమేరకు అర్థం, అది ఏ ఊరి సరిహద్దో దానితోనే ఏర్పడుతుంది. ఊరే లేకపోతే, ఆ పొలిమేర దేనిని వేరు చేస్తుంది? దానికి అర్థం ఏమిటి? అసలు అది ఎక్కడికి చెందుతుంది? దాని ఉనికికి ఆధారమే ప్రశ్నార్థకమవుతుంది.

ఆధారం లేని తేలియాడే బల్ల ఈ పరిశీలనకు మరో కోణాన్ని జోడిస్తుంది. ఒక సరిహద్దుకు అర్థాన్నిచ్చే ఆధారాన్ని పరిశీలించకుండా దానిని సహజంగా స్వీకరించినట్టే, ప్రపంచంతో మనకున్న సంబంధాన్ని కూడా మనం ప్రశ్నించకుండా అంగీకరిస్తాం. కానీ ప్రపంచంతో మన సంబంధానికి ఆధారం ఏమిటి? మనం నిజంగా స్థిరమైన నేల మీద నిలబడి ఉన్నామా? లేక మనం ఎన్నడూ పరిశీలించని ఒక పునాదిని ఉన్నదని ఊహించుకుంటున్నామా?

-x-x-END-x-x-

Comments

Popular posts from this blog

T6-W1-The EXIT DOOR (వెలుపలికి దారి)

T5-D1-Dreams on a Beach (అంతులేని అంచు)

4-V1-Eyes on the Table