అధివాస్తవిక చిత్రముల వివరణ​

 

కొన్ని అధివాస్తవిక చిత్రాలను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను.

అధివాస్తవిక చిత్రాలు మనకు పరిచయమైన ప్రపంచాన్ని దాటి, కలలను, అచేతన మనస్సును అన్వేషిస్తాయి. అందం, ఆకారం, నైతికత, పరిచయమైన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించక దాటవేసే ధోరణి వంటి పరిమితులను దాటి, వీక్షకుడి మనస్సును చిత్రంతో అనుసంధానిస్తాయి. సాధారణంగా మనకు పరిచయమైన వస్తువులను విచిత్రమైన లేదా అసాధ్యమైన పరిస్థితుల్లో ఉంచడం ద్వారా, మనం అలవాటుగా చూసే విధానాన్ని సవాలు చేస్తాయి.

వాటి ఉద్దేశం కేవలం కల్పనతో కూడిన దృశ్యాలను సృష్టించడం మాత్రమే కాదు. అలవాటుపడిన గ్రహణ విధానాన్ని సమూలముగా ప్రశ్నించి, వెంటనే మనకు స్పష్టంగా కనిపించని అర్థాలను స్పురింపచేయుట కూడా. ఒక అధివాస్తవిక చిత్రం ఎప్పుడూ మనం ఏమి ఆలోచించాలో చెప్పదు; మనకు ఇప్పటికే అర్థమయ్యాయని భావించిన విషయాలను మరోసారి పరిశీలించుకునేలా చేస్తుంది. భావమును ఆకారము అందముల బందిఖానా నుండి విడదీసి చిత్రకారుణ్ణి వీక్షకుని మనసుతో ప్రత్యక్షంగా కలిపే యత్నమిది. ఇంకొక గమనించ వలసిన విషయము ఏమంటే పెయింటింగ్ పేరు కూడా చిత్రములోని భాగమే.

— END — 

విషయానుక్రమణిక​

TR — Rene Magritte  రెనే మాగ్రిట్
TD — Salvador Dali సాల్వడార్ డాలీ
TH — Hilma Af Klint హిల్మా యాఫ్ క్లింట్
TV — Remedios Varo రెమెడియోస్ వారో
TM — Max Earnst మాక్స్ అర్నస్ట్
TW — William D Higginson విలియం హిగ్గిన్సన్

Comments

Popular posts from this blog

T6-W1-The EXIT DOOR (వెలుపలికి దారి)

T5-D1-Dreams on a Beach (అంతులేని అంచు)

4-V1-Eyes on the Table